Hajj pilgrims | మక్కాలో తీవ్రమైన వేడి.. మృతిచెందిన హజ్ యాత్రికుల్లో 90 మంది భారతీయులే..?
Hajj pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 90 మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Hajj pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్ యాత్రికులు (Hajj Pilgrims) అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడికి యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. ఇక ఇప్పటి వరకూ 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి.
చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నట్లు చెప్పారు. ఈజిప్ట్, జోర్దాన్ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు (Egyptians) కాగా, 90 మందికిపైగా జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. అయితే, చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 68 మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ దౌత్యాధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే, భారతీయుల సంఖ్యపై సౌదీ అధికారులు గానీ, భారత ప్రభుత్వం గానీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. మరో రెండు లక్షల మంది సౌదీ అరేబియా వాసులుగా పేర్కొన్నారు.
ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన అల్-ముయిసెమ్ ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, గతేడాది హజ్ యాత్రలో 240 మంది యాత్రికులు చనిపోయారు. వారాలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్లు సౌదీ మీడియా తెలిపింది.
Also Read..
Klin Kaara | క్లింకార ఫస్ట్ బర్త్‌డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన
Toxic Alcohol | 29కి చేరిన తమిళనాడు నాటు సారా మృతులు..
Air Pollution | ప్రాణాలు హరిస్తున్న వాయుకాలుష్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

