Air Pollution | న్యూఢిల్లీ, జూన్ 19: వాయుకాలుష్యం కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది. భారత్‌లో 21 లక్షలమంది మరణించినట్టు ఈ నివేదిక తెలిపింది. యునిసెఫ్‌తో కలిసి హెచ్ఈఐ ఈ పరిశోధన చేపట్టింది. దక్షిణ ఆసియాలో మరణాలకు వాయు కాలుష్యం ప్రధాన కారణంగా ఉన్నదని, తర్వాతి స్థానాల్లో అధిక రక్తపోటు, పొగాకు ఉన్నాయని తెలిపింది.