Droupadi Murmu | భారత రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) విదేశీ పర్యటనకు వెళ్లారు. నేటి (ఆగస్ట్ 5వ తేదీ) నుంచి ఆరు రోజుల పాటు ఫిజీ (Fiji), న్యూజిలాండ్, తిమోర్-లిస్తె దేశాల్లో ముర్ము పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి ఫిజీకి చేరుకున్నారు. రేపటి వరకూ ఫిజీ పర్యటనలోనే ఉండనున్నారు.
భారత రాష్ట్రపతి ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు విలియమ్ కటోనివెరేతోపాటు ఆ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకాతో దైపాక్షిక చర్చల్లో (bilateral meetings) రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఫిజీ పార్లమెంట్లో ఆ దేశ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా భారత సంతతివారితో ముచ్చటించనున్నారు.
ఫిజీ పర్యటన అనంతరం ముర్ము న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తారు. ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటిస్తారు. అక్కడ గవర్నర్ జనరల్, ప్రధాన మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 10న తిమోర్-లిస్తె చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడు జోస్ రామోస్ – హోర్తాతో భేటీ అవుతారు.
#WATCH | President Droupadi Murmu arrives in Fiji on a State visit.
During her visit, President Murmu will hold bilateral meetings with Fiji President Katonivere and Prime Minister Sitiveni Rabuka. President Murmu is scheduled to address the Fijian Parliament and interact with… pic.twitter.com/hoJnxUuemG
— ANI (@ANI) August 5, 2024
Also Read..
Amarnath Yatra | ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. అమర్నాథ్ యాత్రను నిలిపివేసిన అధికారులు
Emergency Landing | ప్రయాణికురాలి తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Iran | ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి..?