Amarnath Yatra | పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)ను అధికారులు నేడు నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శనివారం జమ్మూ బేస్ క్యాంప్ (Jammu base camp) నుంచి అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. ఆ ప్రాంతం నుంచి యాత్రకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించట్లేదు.
ఇక ఇప్పటికే 1,112 మంది భక్తులతో కూడిన బ్యాచ్ ఆదివారం నాడు భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి రెండు ఎస్కార్టెడ్ కాన్వాయ్లల్లో లోయకు బయల్దేరి వెళ్లింది. అయితే, సోమవారం కొత్త లాట్‌ను అధికారులు నిలిపివేశారు. అధికారుల చర్యతో వందలాది మంది యాత్రికులు క్యాంపులకే పరిమితమయ్యారు.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్దమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆర్టికల్ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ, శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.
Also Read..
Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి.. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్
Pakistan posters | ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం