రుద్రంగి, జనవరి 5: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలం మాదిరిగానే ఇప్పుడూ పరి స్థితి నెలకొన్నది. ఆదివారం రుద్రం గి సహకార సంఘానికి 440 బస్తా లు రావడంతో 200 మంది రైతులు సోమవారం తెల్లవారుజామునే చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుం చే బారులుతీరారు. ఆధార్ కార్డులు వరుసలో పెట్టి బస్తాల కోసం పడిగాపులుకాశారు. 11 గంటలకు వచ్చిన సిబ్బంది ఎకరానికి బస్తా చొప్పున మాత్రమే అందజేశారు. బస్తాలు దొరక్క సుమారు 80 మంది రైతులు వెనుదిరిగారు. పాలకులకు ముందుచూపు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. రుద్రంగి మండల వ్యాప్తంగా 800 టన్నుల యూరియా అవసరం ఉన్నదని, 400 టన్నులు అందుబాటులో ఉన్నట్టు ఏవో ప్రియదర్శిని తెలిపారు.