సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 5: ప్రజాదరణ లేని కవిత కేవలం ఉనికిని చాటుకునేందుకు చేపట్టిన జనం బాటను ప్రజలు విశ్వసించరని తెలంగాణ జాగృతి బాధితుల ఐక్య వేదిక కన్వీనర్ సంగ్రామ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కవిత పర్యటనలో డబ్బులు ఇచ్చి జనాలను పోగు చేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కార్యకర్తల భు జాలపై నాయకురాలిగా ఎదిగిన ఆమె అధికారంలోకి వచ్చాక ఏనాడైనా వారిని పట్టించుకున్నారా? అని నిలదీశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిడికెడు మందితో మొదలైన తెలంగాణ జాగృతి.. తెలంగాణ ఉద్యమంలో బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సహకారంతో అంచలంచెలుగా ఎదిగిన విష యం వాస్తవం కాదా? అన్ని ప్రశ్నించారు. జనం బాట మొదలుపెట్టే ముందు సాహితీవేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు, బడుగు, బలహీనవర్గాలతో సమావేశాలు నిర్వహిస్తానని చెప్పిన మాట ఏమైందని నిలదీశారు. గుడులు, దవాఖానల వద్దకు వెళ్లి అక్కడి వారంతా ఆమె కో సం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నార ని ఎద్దేవాచేశారు. అధికారం కోల్పోయిన తరువాత నేరెళ్ల బాధితుల కోసం రావడం సిగ్గుచేటన్నారు. మహిళా బిల్లు, అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఏర్పాటు, బీసీ బిల్లు వంటి అంశాలను ముందే గ్రహించి ఉద్యమించినట్టు నటించారని ఆరోపించారు.