న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఢిల్లీ సర్వీసుల బిల్లు సహా పార్లమెంట్ ఆమోదించిన పలు బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం సంతకం వేశారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ), జనన, మరణాల రిజిస్ట్రేషన్(సవరణ) బిల్లు, జన విశ్వాస్(సవరణ) బిల్లు, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లులు చట్టరూపం దాల్చాయి.
పార్లమెంట్లో డీపీడీపీ, ఢిల్లీ సర్వీసుల బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పౌరుల వ్యక్తిగత డాటా హక్కు పేరుతో ప్రభుత్వం నిఘా కార్యకలాపాలకు దిగుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి.