శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 31, 2020 , 11:58:11

2020 ఆరోగ్య సంపదను నేర్పించింది : ఎయిమ్స్‌ శంఖుస్థాపనలో మోదీ

2020 ఆరోగ్య సంపదను నేర్పించింది : ఎయిమ్స్‌ శంఖుస్థాపనలో మోదీ

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ రాజ్‌కోట్‌లో నిర్మించతలపెట్టిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మోదీ.. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. 2020.. ఆరోగ్య సంపద అంటే ఏమిటో మనకు నేర్పించిందని అన్నారు. ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదని ఈ సంవత్సరం నిరూపించిందని, ఈ సంవత్సరం మొత్తం ప్రపంచానికి సవాలుగా మారిందని, అయితే, ఒత్తిళ్లను జయించి విజయవంతంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి చేరడం గర్వించదగిన విషయమన్నారు. కష్టతరమైన ఈ సంవత్సరం సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను చూపించింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్న సహచరులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులను దేశం ఎన్నటికైనా గుర్తుంచుకుంటుందని ప్రధాని అన్నారు. పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసిన వారందరికీ ప్రశంసించాల్సిన దినమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారిని నిలువరించేందుకు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే ఏడాదిలో వ్యాక్సినేషన్‌ జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

ఎయిమ్స్‌ను సెంట్రల్‌ పీఎస్‌యూ హెచ్‌ఎస్సీసీ లిమిటెడ్‌ నిర్మిస్తున్నది. దానిలో తొమ్మిది భవానల డ్రాయింగ్లకు తాత్కాలిక ఆమోదం లభించింది. రూ.1195 కోట్లు వెచ్చించి 750 పడకలతో నిర్మిస్తున్న ఎయిమ్స్ కోసం ప్రభుత్వం 201 ఎకరాల భూమిని కేటాయించింది. 2022 నాటికి పూర్తిచేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు. 750 పడకల ఎయిమ్స్‌లో 30 పడకల ఆయుష్ బ్లాక్ కూడా ఉండనున్నది. ఇందులో 125 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు కేటాయించనున్నారు. తొలి బ్యాచ్‌ తరగతులు డిసెంబర్‌ 21 న పండిట్‌ దీనదయాల్‌ ఉపాధ్యాయ వైద్య కళాశాలలోని తాత్కాలిక ప్రాంగణం నుంచి మొదలయ్యాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo