Loksabha Elections 2024 : హుబ్బలి-ధార్వాడ్ లోక్సభ స్ధానం నుంచి తన నామినేషన్ను ఉపసంహరించుకోనున్నట్టు లింగాయత్ బాబా దింగలేశ్వర్ స్వామి సోమవారం ప్రకటించారు. ఈ స్ధానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్ధి ప్రహ్లాద్ జోషిపై ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలో దిగిన దింగలేశ్వర్ స్వామి ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ ఉపసంహరించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు. ఇక ధార్వాడ్లో ఏ అభ్యర్ధికి తాను మద్దతిస్తాననే వివరాలను మంగళవారం చెబుతానని దింగలేశ్వర్ స్వామి ప్రకటించారు.
తటస్ధంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నానని, అయితే ఏ అభ్యర్ధికి మద్దతు తెలుపాలనే నిర్ణయం త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. కాగా ధార్వాడ్ నుంచి దింగలేశ్వర్ స్వామి నామినేషన్ దాఖలు చేయడంపై అంతకుముందు భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్వామీజీ రాజకీయాల్లో పాల్గొనాలని కోరుకుంటే ముందుగా మఠం బాధ్యతల నుంచి వైదొలగాలని భక్తులు పట్టుబట్టారు.
Read More :