JEE Main | జేఈఈ మెయిన్ (సెషన్-2) తుది కీ విడుదల..
JEE Main | జేఈఈ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల ఫైనల్ ఆన్షర్ కీ విడుదలైంది. ఈ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది.
JEE Main | న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల ఫైనల్ ఆన్షర్ కీ విడుదలైంది. ఈ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ అంతకన్నా ముందే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోర్ కార్డును పొందొచ్చు.
ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్‌ను ఎన్డీఏ విడుదల చేయనుంది.
జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 17 నుంచి 26వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. మే 26న ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 9న ప్రకటించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

