Aa Okkati Adakku | అల్లరి నరేశ్ (Allari Naresh) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా (Faria Abdulla) హీరోయిన్గా నటిస్తుంది. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అల్లరి నరేశ్ పెళ్లి ప్రయత్నాల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫన్ ఎలిమెంట్స్‌తో వేసవికి వినోదాన్ని పంచడం పక్కా అని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఓ 49 సంబంధాలు చూసినా పెళ్లవక 50వ సంబంధం సెట్టవుతుందా..? లేదా ? అని నేను టెన్షన్ పడుతుంటే.. పెళ్లాం.. పిల్లలని వెక్కిరిస్తున్నావేంట్రా.. అంటూ నరేశ్ కామెడీ టచ్‌తో చేస్తున్న సీరియస్ ఫైట్ ఆసక్తిని పెంచుతోంది. మాలాంటి పెళ్లి కాని వాళ్లకు వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి.. పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని దొబ్బేవాడిని లోపలేయించండి.. అంటూ అల్లరి నరేశ్ కోర్టులో చీఫ్ జస్టిస్ ముందు చెప్పే డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా సాగుతున్నాయి.
ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రోడక్షన్ పనుల కారణంగా..ఈ చిత్రాన్ని మే 03న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్..
Brimming with happiness, the confident #AaOkkatiAdakku Team shines in these candid clicks from the #AOATrailer Launch Event 🤘
𝐍𝐚𝐭𝐮𝐫𝐚𝐥 𝐒𝐭𝐚𝐫 @NameisNani‘s presence added more amazement to the Event 🤩
▶️https://t.co/R5KDoc8xZ0
#AOAonMay3rd @allarinaresh… pic.twitter.com/2qmrEA2K3y— YouWe Media (@MediaYouwe) April 22, 2024
ఆ ఒక్కటీ అడక్కు టీజర్..