Prashant Kishore : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నన్నద్ధమవుతున్న జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore)కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అరా సిటీలో సభకు హాజరైన ఆయన నడుస్తూ వెళ్లి జనంతో మాట్లాడుతుండగా ఒక గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆయన పక్కటెముకల(Ribs)కు మాత్రమే గాయాలయ్యాయి. దాంతో, ప్రశాంత్‌ను హుటాహుటిన పాట్నాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
సభ జరుగున్న సమయంలో ప్రశాంత్ కిశోర్ ప్రజలతో మమేకం అవుతూ.. వాళ్లతో మాట్లాడుతుండగాను ఒక వాహనం ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎడమవైపు పక్కటెముల భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పుడాయన పాట్నా చేరుకున్నారు అని జన్ సురాజ్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ 2024 అక్టోబర్ 2న రాజకీయ పార్టీని ప్రారంభించారు. త్వరలో జరుగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అయితే.. ప్రశాంత్ పార్టీ రంగంలోకి దిగడంతో ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు ఆసక్తిగా ఉండనుంది. జేడీ (యూ), బీజేపీ కూటమి, మహాగట్బంధన్ పార్టీలతో జన్ సురాజ్ ఏ మేరకు పోటీపడుతుందో చూడాలి.