న్యూఢిల్లీ: కాంగ్రెస్లో చీడ ప్రారంభమైందని, పార్టీ దుస్థితిపై తీవ్రంగా ఆత్మావలోకనం చేసుకోవడం తప్పనిసరి అని శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. చాలా మంది పాత కాంగ్రెస్ నేతలు పార్టీతో తాము వేరుగా ఉన్నామనే భావనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులు, అగ్ర నేతలకు ఓ సిద్ధాంతం లేకపోవడం దీనికి కారణాలని వివరించారు.
శర్మిష్ఠ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె. ఆమె ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వంశపారంపర్య నేతలు కానివారి సేవలను కాంగ్రెస్ గుర్తించడం గురించి అడిగినపుడు శర్మిష్ఠ బదులిస్తూ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విషయంలో ఏం జరిగిందో మనం మర్చిపోలేమన్నారు.