Bhopal | మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. పవర్ పోవడంతో కుమారుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడన్న షాక్‌లో ఓ తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన భోపాల్ (Bhopal)లోని రాయల్ ఫార్మ్ విల్లా కాలనీ (Royal Farm Villa Colony)లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాత్రి 10 గంటల సమయంలో భోపాల్‌లో బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో 8 ఏళ్ల దేవాన్ష్ (Devansh) లిఫ్ట్‌లో తన ఫ్లాట్‌కు బయల్దేరాడు. బాలుడు లిఫ్ట్‌లోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా కరెంట్ పోవడంతో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో ఆ బాలుడు అందులో చిక్కుకుపోయి గట్టిగా కేకలు వేశాడు. అప్రమత్తమైన బాలుడి తండ్రి 51 ఏళ్ల రిషిరాజ్ భటానగర్ (Rishiraj Bhatanagar) జనరేటర్ గది వైపు పరుగులు తీశాడు. మూడు నిమిషాల్లోనే విద్యుత్‌ను పునరుద్ధరించాడు. దీంతో లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, ఆ షాక్‌లో ఉన్న రిషిరాజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడికి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రిషిరాజ్ మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ ఇంట్లో పూర్తిగా చీకట్లు అలముకున్నాయి.
Also Read..
Mock Drills | పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో రేపు మాక్‌డ్రిల్స్.. ప్రజలను అప్రమత్తం చేసిన కేంద్రం