Manipur: కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేలు రెఢీ.. గవర్నర్‌ను కలిసిన మణిపూర్ బీజేపీ నేత
Manipur: మణిపూర్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేత తోక్చమ్ రాధేశ్యామ్ సింగ్ తెలిపారు. 44 మంది ఎమ్మెల్యేలు రెఢీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు.
ఇంపాల్: వర్గ పోరు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్(Manipur)లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేత తోక్చమ్ రాధేశ్యామ్ సింగ్ తెలిపారు. ఇవాళ ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నటల్ఉ ఆయన చెప్పారు. గవర్నర్‌కు ఇదే విషయాన్ని చేరవేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మణిపూర్‌లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.
స్పీకర్ సత్యబ్రత వ్యక్తిగతంగా 44 మంది ఎమ్మెల్యేలను కలిశారని, కొత్త ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వ పాలనలో రెండేళ్లు కోవిడ్‌కు వెళ్లాయని, మరో రెండేళ్లు వర్గ హింస చోటుచేసుకున్నట్లు చెప్పారు. మైతీలు, కుక్కీలు కొట్టుకోవడంతో.. మాజీ బీజేపీ నేత ఎన్ బిరేన్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రెండు తెగల మధ్య జరిగిన పోరును ఆపలేకపోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
మణిపూర్ అసెంబ్లీ సామర్థ్యం 60 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే మరణించడం వల్ల 59 మాత్రమే ఉన్నారు. బీజేపీ కూటమిలో 32 మంది మైయితీ తెగ ఎమ్మెల్యేలు, ముగ్గురు మణిపురి ముస్లిం ఎమ్మెల్యేలు, 9 మంది నాగా వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మొత్తం సంఖ్య 44గా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా మైయితీ తెగువకు చెందినవారే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

