Polling | అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Polling | అస్సాం, కేరళల రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు.
Polling : అస్సాం (Assam), కేరళ (Kerala) ల రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల (Polling centers) దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 296 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది. కేరళలోఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ జరుగుతున్నది. పుదుచ్చేరిలో ఎన్డీఏ, డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది. అస్సాంలోని 126 నియోజకవర్గాలకు 31,490 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో నిలిచారు. కేరళలోని 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు 1,099 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 9 గంటల వరకు కేరళలో 16.23 శాతం, అస్సాంలో 17.87 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లను తమ ఓటు వినియోగించుకోవాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

