సూర్యకాంతి మంచి నిద్రకు మార్గమా?
ఉదయపు కాంతి మనల్ని మేల్కొలుపుతుందనే తెలుసు. కానీ నిద్ర పుచ్చుతుందని కూడా విన్నారా... కానీ సరికొత్త విషయాన్ని ఇటీవలి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. చక్కటి వెలుతురు శరీరాన్ని తాకడం అన్నది మంచి నిద్రకు బాటలు వేస్తుందని వాళ్లు చెబుతున్నారు.
ఉదయపు కాంతి మనల్ని మేల్కొలుపుతుందనే తెలుసు. కానీ నిద్ర పుచ్చుతుందని కూడా విన్నారా… కానీ సరికొత్త విషయాన్ని ఇటీవలి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. చక్కటి వెలుతురు శరీరాన్ని తాకడం అన్నది మంచి నిద్రకు బాటలు వేస్తుందని వాళ్లు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం, వ్యాయామం, మందులు మాత్రమే సరిపోవని… ప్రకృతి ప్రసాదించే వెలుతురూ అంతే ముఖ్యమని తాజా వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు సహజ సూర్యకాంతిలో గడిపితే శరీరంలోని జీవగడియారం సక్రమంగా పనిచేసి, రాత్రి నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందట. ఇటీవల మాంచెస్టర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనంలో భాగంగా 89 మంది పెద్దలను పరిశీలించారు.
వాళ్లు ధరించిన ప్రత్యేక పరికరాల ద్వారా రోజంతా ఎంత సహజ కాంతి అందుతోందో, రాత్రి ఎంతసేపు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో నమోదు చేశారు. పగటి వేళల్లో ఎకువసేపు సహజ వెలుతురులో గడిపినవారిలో నిద్ర నాణ్యత మెరుగ్గా ఉండటమే కాకుండా, మేలొన్న తర్వాత ఎక్కువ ఉత్సాహంగా కూడా కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదే అంశం మీద మరో పరిశోధనలో భాగంగా, హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతమంది విద్యార్థులను పరిశీలించారు.
ఉదయం సహజ కాంతిలో కొంతసేపు గడిపిన వారిలో ఏకాగ్రత, చురుకుదనం, రాత్రి నిద్రలో మెరుగుదల కనిపించినట్లు వీళ్లు గుర్తించారు. అయితే ఈ ఫలితాలను మరింత పెద్ద సంఖ్యలో ప్రజలపై పరీక్షించి నిర్ధారించాల్సి ఉందని కూడా వీళ్లు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి నిద్రలేచిన వెంటనే మొబైల్ తెరవడం కంటే, ఇంటి ముంగిట ఓ పది నుంచి ఇరవై నిమిషాలు సహజ సూర్యకాంతిలో గడపడం మంచి విషయం అన్నమాట!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

