హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 1,743 డ్రైవర్, శ్రా మిక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెం ట్ బోర్డ్ సోమవారం అధికారికంగా విడుదల చేసింది. నిరుడు సెప్టెంబర్ 17న వెలువడిన నోటిఫికేషన్ ఆధారం గా మెరిట్, డ్రైవింగ్ టెస్ట్ మారులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఫలితాలు ఖరారు చేశారు.
మొత్తం వెయ్యి డ్రైవర్ పోస్టులకు 894 మంది పురుషులు ఎంపికయ్యారు. అలాగే 743 శ్రామిక్ పోస్టులకు 710 మంది (694 పురుషులు, 16 మంది మహిళలు) ఎంపికయ్యారు. మొత్తం 1,743 పోస్టులకు 1,604 మందిని ఎంపిక చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడం వల్ల 139 పోస్టులు మిగిలిపోయినట్టు బోర్డు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, డ్రైవింగ్ టెస్ట్ మారులు, కట్-ఆఫ్ మారుల వివరాలు వెబ్సైట్ www.tgprb.i nలో చూసుకోవచ్చని డీజీ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 7న ‘చలో హైదరాబాద్’కు పెన్షనర్స్ జేఏసీ పిలుపు ఇచ్చింది. శుక్రవారం ఇందిరాపార్క్‌లో వేలాది మందితో మహాధర్నా నిర్వహించనున్న ట్టు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ తెలిపారు. జేఏసీ కోర్ కమిటీ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
హెల్త్‌కార్డులు అమలుకాకపోవడం, పీఆర్సీ ప్రకటించకపోవడం, ఆరు డీఏలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మహాధర్నా తలపెట్టామని పేర్కొన్నారు. ‘అట్టహాసంగా ప్రకటించిన హెల్త్‌కార్డుల జారీ ఇంకా ప్రారంభంకాలేదు. మళ్లీ కొత్తగా ఫొటోలు, వివరాలు అప్లోడ్ చేయాలంటున్నారు. ఆరు నెలలు పట్టే అవకాశమున్నది.. ఇదేం స్కీమ్’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన హెల్త్‌కేర్ ట్రస్టుబోర్డు సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా వైద్యం సక్రమంగా అందుతున్నట్టు ప్రకటనలు జారీచేస్తున్నారని మండిపడ్డారు.