(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మంచినీరు, విద్యుత్తు లాంటి కనీస వసతులు కల్పించటంలో బీజేపీ, కాంగ్రెస్‌లు విఫలమయ్యాయని.. ఇందుకు నిరసనగా రానున్న ఎన్నికల్లో ఓటేయొద్దని ఛత్తీస్‌గఢ్‌లోని రెండు గిరిజన గ్రామాల ప్రజలు తీర్మానించారు. రాంపూర్ అసెంబ్లీ పరిధిలోని కెరాకఛార్ గ్రామ పంచాయితీలోని సార్డీహ్, బగ్ధారీ డాండ్ గ్రామాల గిరిజనులు ఈ మేరకు నిర్ణయించారు.