Rahul Gandhi | ప్రధాని మోదీ (PM Modi) పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మండుతుంటే ప్రధాని మాత్రం పార్లమెంట్ లో జోకులేస్తూ.. నవ్వుతున్నారని మండిపడ్డారు. హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోయాయని ప్రశ్నించారు.
మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ 2 గంటల 13 నిమిషాల పాటు మాట్లాడారు. చివరికి మణిపూర్ అంశంపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. నెలల తరబడి మణిపూర్ కాలిపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ప్రధాని మాత్రం నవ్వుతున్నారు. జోకులు పేల్చుతున్నారు. అలాంటి వ్యవహార శైలి ప్రధానికి సరికాదు’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సైన్యానికి అవకాశం ఇస్తే రెండు గంటల్లో మణిపూర్ను చక్కదిద్దుతుందని అన్నారు. అయితే, ప్రధాని మణిపూర్ను తగలబెట్టాలనుకున్నారు.. అందుకే హింసను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అని రాహుల్ ఆరోపించారు.
Also Read..
Teapot | ఈ టీపాట్ ధర రూ. 24 కోట్లు.. ఎందుకు ఇంత రేట్.. అసలేంటి దీని ప్రత్యేకత !