 
                                                            Sardar Patel | స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి నేడు (birth anniversary). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా దివస్ (Ekta Diwas) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పరేడ్ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పలు శకటాలను ప్రదర్శించారు. ఇక నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) కుటుంబ సభ్యులను ప్రధాని కలిసి విషయం తెలిసిందే.
Also Read..
Word of The Year | వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా 67.. మీనింగ్ ఏంటో తెలుసా?
ముంబైలో ఆడిషన్స్‌కు వచ్చిన చిన్నారులను నిర్బంధించాడు.. పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు
కుమార్తె చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే.. లంచాల కోసం అధికారుల వేధింపులు
 
                            