 
                                                            బెంగళూరు, అక్టోబర్ 30 : చనిపోయిన తన కుమార్తెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి అవసరమైన పోస్ట్‌మార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికెట్ పొందేందుకు లంచగొండి అధికారులకు తాను ముడుపులు చెల్లించాల్సి వచ్చిందంటూ ఓ రిటైర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పాలనలో కర్ణాటకలో పెచ్చరిల్లిపోతున్న అవినీతికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమని నెటిజన్లు మండిపడుతున్నారు.
బీపీసీఎల్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)గా పనిచేసి రిటైర్ అయిన కే శివకుమార్ తాను అనుభవించిన వేదనను, అనేక మందికి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి గురించి లింక్డ్ఇన్ పోస్టులో వివరించారు. అయితే శివకుమార్ పోస్టుపై వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
 
                            