 
                                                            న్యూఢిల్లీ : ఈ ఏడాది పదం 67 అని డిక్షనరీ.కామ్ బుధవారం ప్రకటించింది. దీనిని సిక్స్టీసెవెన్ అని కాకుండా ‘సిక్స్ సెవెన్’ అని పలకాలని చెప్పింది. 2024లో స్క్రిల్లా విడుదల చేసిన పాట “డూట్ డూట్”లో సిక్స్ సెవెన్ అనే పదం టిక్ టాక్‌లో వైరల్ అయింది. ఎన్బీఏ ప్లేయర్ లామెలో బాల్ పొడవు 6 అడుగుల 7 అంగుళాలు. వీటిని దృష్టిలో ఉంచుకుని సిక్స్ సెవెన్‌ను డిక్షనరీ.కామ్ ఎంపిక చేసిందని కొందరు భావిస్తున్నారు.
అయితే, డిక్షనరీ.కామ్ కథనం ప్రకారం, వర్డ్ ఆఫ్ ది ఇయర్ , 2025గా 67 ఎంపికైంది. పిల్లలు, టీనేజర్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ పదాన్ని వాడుతున్నట్లు టీచర్లు, తల్లిదండ్రులు గమనించారు. ‘సో-సో’, ‘మేబీ దిస్’, ‘మేబీ దట్’ వంటి పదాలకు సమానార్థకంగా ‘సిక్స్ సెవెన్’ అంటున్నట్లు గుర్తించారు.
 
                            