శనివారం 28 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 17:19:40

దీపావళికి.. దేశీయ ఉత్పత్తులనే కొనండి: మోదీ

దీపావళికి.. దేశీయ ఉత్పత్తులనే కొనండి: మోదీ

న్యూఢిల్లీ: దీపావళి పండుగవేళ దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రజలకు పండుగ బహుమతి ఇచ్చారు. రూ.600 కోట్లకుపైగా ప్రాజెక్టులకు సోమవారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. దీపావళి పండుగకు దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. ‘దేశంలో తయారు కాని, గతంలో కొనుగోలు చేసిన ఉత్పత్తులను డంప్‌ చేయవద్దని, వాటిని కొనుగోలు చేయవద్దని నేను కోరడం లేదు. మట్టి దీపాలను మాత్రమే కొనడం అంటే అర్థం అది కాదు. స్థానిక ఉత్పత్తులకు చేయూతనివ్వడం’ అని మోదీ తెలిపారు. దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడి తయారీదారుల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ప్రోత్సహించినట్లవుతుందని మోదీ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.