Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) పిల్లలతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉన్న ఓ పాత ఫొటో ఇటీవలే నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫొటోలో మస్క్ ఇద్దరి పిల్లలతో మోదీ కరచాలనం చూస్తూ కనిపించారు. ఆ ఫొటోలో మస్క్ కూడా ఉంటారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోపై మస్క్ తాజాగా స్పందించారు. ఆ ఫొటోల్లో ఉన్న తన పిల్లల పేర్లను కామెంట్‌గా పెట్టారు. ఫొటోల్లో మోదీతో ఉన్నది డామియన్, కైకోట్ (Damian, Kaiquot)గా పేర్కొన్నారు.
Damian & Kai
— Elon Musk (@elonmusk) August 2, 2024
మస్క్‌కు మొత్తం 11 మంది పిల్లలు అన్న విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురు తొలి భార్య జస్టిన్ మస్క్‌కు జన్మించారు. డామియన్, కైకోట్ మొదటి భార్యకు జన్మించిన పిల్లలే. 2004లో జస్టిన్ మస్క్‌కు వివియన్, గ్రిఫిన్ అనే కవలలు పుట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు 2006లో కైకోట్, డామియన్, సాక్సన్ అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. 11 మందిలో మరో ముగ్గురు మ్యూజిషియన్ గ్రిమెస్‌కు, ఇంకో ముగ్గురు న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ అయిన షివాన్ జెలీస్‌కు పుట్టారు.
Also Read..
Pinarayi Vijayan | కొండచరియలు విరిగిపడిన ఘటన.. సీఎండీఆర్ఎఫ్కు కేరళ సీఎం విరాళం
Donald Trump | కమలా హారిస్‌తో డిబేట్‌కు ఓకే చెప్పిన ట్రంప్
PM Modi: ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తోంది: ప్రధాని మోదీ