Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ (Kamala Harris) పేరు కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ట్రంప్ ఓకే చెప్పారు.
సెప్టెంబర్ 4న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ (presidential debate) నిర్వహించాలని ఫాక్స్ న్యూస్ చేసిన ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. సెప్టెంబర్ 4 బుధవారం నాడు కమలా హారిస్‌తో డిబేట్ చేయడానికి ఫాక్స్ న్యూస్ (Fox News) చేసిన ప్రతిపాదనకు తాను అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. గతంలో ఏబీసీలో బైడెన్‌తో చర్చ జరిగిందని గుర్తు చేశారు. అయితే, ఆ డిబేట్ అనంతరం బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు.
కాగా, జూన్ 27న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య డిబేట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో ఇరువురు నేతలూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇక ఈ డిబేట్లో ట్రంప్‌దే పైచేయిగా కనిపించింది. దీంతో బైడెన్‌కు సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు.
అదే సమయంలో డెమోక్రాట్ల అభ్యర్థిగా ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హారిస్ బరిలోకి వచ్చారు. ఈ క్రమంలో ట్రంప్‌తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని కూడా ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించే వరకూ వేచి చూస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న కమలా హారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రాటిక్ పార్టీ ఖరారు చేసింది. దీంతో హారిస్‌తో డిబేట్‌కు ట్రంప్ సై అన్నారు.
Also Read..
Bomb Threat | స్కూల్‌కు వెళ్లడం ఇష్టంలేక.. బాంబు బెదిరింపు మెయిల్ పంపిన విద్యార్థి
Cloudburst | హిమాచల్‌లో వరద విలయం.. ఊరంతా కొట్టుకుపోయి.. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది
Mohanlal | లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో.. వయనాడ్‌లో పర్యటించిన మలయాళ నటుడు మోహన్‌లాల్