Bomb Threat | దేశంలో ఇటీవలే బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. పాఠశాలలు, విమానాశ్రయాలు, పలువురు నేతలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీ (south Delhi)లోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ (Summer Fields School)కు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బెదిరింపు మెయిల్ వచ్చింది.
శుక్రవారం పాఠశాలకు వచ్చిన అనంతరం స్కూల్ యాజమాన్యం మెయిల్‌ను గమనించి పోలీసులు సమాచారం అందించింది. అప్రమత్తమైన పోలీసులకు వెంటనే అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు వస్తువులూ కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో బెదిరింపు మెయిల్ ఓ బూటకమని తేలింది. ఈ బెదిరింపులకు పాల్పడింది పాఠశాలలో చదివే 14 ఏళ్ల బాలుడని (Student) పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకనే స్కూల్లో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ పంపినట్లు విచారణలో నిర్ధరించారు. అనుమానం రాకుండా సదరు బాలుడు మరో రెండు పాఠశాలల పేర్లను కూడా మెయిల్లో పేర్కొన్నట్లు పోలీసులు తేల్చారు.
Bomb threat at Summer Fields School, Kailash Colony, GK-1, Delhi | Delhi Police say, “A 14-year-old student has been identified and is being questioned. The student didn’t want to go to the school and had, therefore, sent the bomb threat mail. The student had mentioned two more…
— ANI (@ANI) August 3, 2024
Also Read..
Cloudburst | హిమాచల్‌లో వరద విలయం.. ఊరంటా కొట్టుకుపోయి.. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది
Mohanlal | లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో.. వయనాడ్‌లో పర్యటించిన మలయాళ నటుడు మోహన్‌లాల్
Wayanad | 358కు పెరిగిన వయనాడ్ మృతుల సంఖ్య.. అత్యాధునిక సాంకేతికతో గాలింపు