న్యూఢిల్లీ: టారిఫ్ వార్ నేపథ్యంలో ప్రధాని మోదీతో మాట్లాడేందుకు తాను ఎదురు చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో మంగళవారం పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై భారత ప్రధాని మోదీ స్పందించారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ‘రెండు దేశాల్లోని ప్రజలకు మంచి భవిష్యత్తును అందించేందకు అగ్రరాజ్య అధినేతతో కలిసి పనిచేస్తా. భారత్-అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్. మంచి భాగస్వాములు, ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు తొలగిపోతాయని, మా మధ్య సంబంధాలు మరింత పటిష్ఠం అవుతుందని ఆశిస్తున్నా. ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా’ అని మోదీ తెలిపారు.