న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు జపాన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. ఆగస్టు 29వ తేదీన మోదీ జపాన్ వెళ్లనున్నట్లు ఆ శాఖ పేర్కొన్నది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ఆయన మాట్లాడుతారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు జపాన్‌కు వెళ్లారు. రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ నుంచి ఆయన నేరుగా చైనాకు వెళ్తారు.
విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియాతో మిశ్రీ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నట్లు చెప్పారు. ఆ మీటింగ్‌లకు చెందిన అంశాలను ఫైనలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై అప్డేట్స్ ఇస్తామన్నారు. భారత్, జపాన్‌కు క్వాడ్ గ్రూపు దేశాలు కీలకమైనవన్నారు. జపాన్‌లో పర్యటన ముగిసన తర్వాత చైనీస్ పోర్టు నగరం తియాంజిన్‌కు మోదీ వెళ్తారు. అక్కడ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరిగే షాంఘై సహకార సంస్థ మీటింగ్‌కు హాజరవుతారు.
VIDEO | Foreign Secretary Vikram Misri on PM Modi’s upcoming Japan visit: “15th India-Japan annual summit will give both prime ministers opportunity to do in-depth review of bilateral ties, take stock of progress.”
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/5A6xcj8rYb
— Press Trust of India (@PTI_News) August 26, 2025