ఇంపాల్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. శనివారం మణిపూర్‌లో పర్యటించనున్నారు. 2024 మే నెలలో మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య తీవ్రమైన హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఆ రాష్ట్రాన్ని మొదటిసారి మోదీ విజిట్ చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయాన్ని ఇవాళ పీఐబీ వెల్లడించింది. మణిపూర్‌తో పాటు మిజోరం, అస్సం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మోదీ పర్యటిస్తారని పీఐబీ పేర్కొన్నది.
సమగ్ర, సుస్థిర, సమృద్ధికరమైన అభివృద్ధి సాధించే దిశగా ప్రధాని మోదీ పర్యటన సాగనున్నది. మణిపూర్‌లోని చురాచాంద్‌పుర్‌లో సుమారు 7300 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజీ, అసెట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోసం 3600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2500 ఖర్చుతో అయిదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు. మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, 9 ప్రదేశాల్లో వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించనున్నారు. ఇంపాల్‌లో సుమారు 1200 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 71,850 కోట్ల ఖరీదైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బీహార్‌లో జాతీయ మకానా బోర్డును ప్రారంభించనున్నారు. ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు.. బీహార్‌లోని పుర్నియా విమానాశ్రయంలో కొత్త టర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించనున్నారు. పుర్నియాలో సుమారు 36 వేల కోట్ల ఖరీదైన ప్రాజెక్టుల చేపట్టనున్నారు. మిజోరంలోని ఐజ్వాల్‌లో సుమారు 9 వేల కోట్ల ఖరీదైన డెవలప్మెంట్ పనులు ప్రారంభంకానున్నాయి. మిజోరంలో బైరాబి-సైరంగ్ మధ్య కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు.
గౌహతిలో జరగనున్న డాక్టర్ భూపెన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొంటారు. అస్సాంలో సుమారు 18,350 కోట్ల విలువైన పనులకు ప్రఝధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
Prime Minister @narendramodi to visit Mizoram, Manipur, Assam, West Bengal and Bihar from 13th to 15th September
🔸PM to inaugurate and lay foundation stone of projects worth over Rs. 71,850 crore
🔸PM to launch National Makhana Board in Bihar
🔸Furthering regional…
— PIB India (@PIB_India) September 12, 2025
రేపు మణిపూర్‌లో మోదీ పర్యటించనున్న అంశంపై రాహుల్ గాంధీ స్పందించారు. మణిపూర్ ఇష్యూ చాన్నాళ్ల నుంచి ఉందన్నారు. ప్రధాని అక్కడకు వెళ్లడం సంతోషకరం అన్నారు. కానీ ప్రస్తుతం వోట్ చోరీ అంశం కీలకమైందన్నారను. హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలను మార్చేశారన్నారు. వోట్ చోరీ జరిగినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారని రాహుల్ అన్నారు.
మోదీ మణిపూర్ పర్యటన గురించి సీపీఎం నేత బృందా కారత్ స్పందించారు. తీవ్రమైన సంక్షోభం నెలకొన్న ఓ రాష్ట్రాన్ని ప్రధాని ఇన్నాళ్ల వరకు విజిట్ చేయకపోవడం వరల్డ్ రికార్డుగా భావించాల్సి వస్తోందన్నారు. సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ప్రధాని జోక్యం చేసుకోవాలన్నారు. మణిపూర్ రగిలిపోతున్న సమయంలో.. ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. రెండేళ్ల నుంచి అక్కడ జరుగుతున్న అక్రమాలకు ఆయన బాధ్యత తీసుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.