న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 21-23 తేదీల్లో ఆ దేశంలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) సమావేశంలోనూ పాల్గొననున్నారు. అయితే జీ20 సదస్సుకు ట్రంప్ హాజరుకాకపోవడం గమనార్హం.
దక్షిణాఫ్రికాలో మైనార్టీలైన శ్వేతజాతి రైతుల పట్ల ఆ దేశం అనుసరిస్తున్న వివక్షను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ట్రంప్‌కు ఎదురుపడలేకే గతంలో పలు సదస్సులకు నేరుగా హాజరుకాని ప్రధాని మోదీ.. జీ20 సదస్సుకు ట్రంప్ హాజరుకాకపోవడంతో ఇప్పుడు వెళ్తున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.