Operation Sindoor | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ప్రారంభమయ్యాక మోదీ తొలిసారి ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో అన్న ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఇవాళ త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. మూడు దళాలకు చెందిన డీజీఎంవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫైట్ చేసినట్లు తెలిపారు. ఉగ్రవాదులను టార్గెట్ చేసిన సమయంలో పాకిస్థాన్ మిలిటరీ జోక్యం చేసుకున్నదని, ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యతిరేకించిందని, అందుకే తాము రెస్పాండ్ అయినట్లు వారు వివరించారు.
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈనెల 10న ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. ఈ నెల 12న ఇరుదేశాల డీజీఎంవోలు మరోసారి చర్చలు జరపున్నట్లు అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు హాట్లైన్లో చర్చలు జరపున్నారు. ఇక ఈ చర్చల్లో భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ తరఫున డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొననున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిణామాలు, పీవోకే అంశం, కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ చర్చలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ చేశారు. అయితే, ఆ తర్వాత సాయంత్రానికి వాయిదా వేశారు.
Also Read..
Operation Sindoor | పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి చేసిందా?.. ఐఏఎఫ్ అధికారి ఏం చెప్పారంటే?