న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ పాల్పడిన సైనిక దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే పాక్‌లోని కీలకమై 8 వైమానిక స్థావరాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ధ్వంసం చేసింది. భారత్ దాడుల్లో సర్గోధలోని ముషఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా నిర్ధారణ అయ్యింది. కిరానా హిల్స్ కింద ఉన్న భూగర్భ అణు నిల్వలకు ఈ రన్ వే అనుసంధానంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అణు కేంద్రం సమీపంలో భారత్ దాడి చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
కాగా, సోమవారం త్రివిధ దళాల మీడియా సమావేశం సందర్భంగా ఒక జర్నలిస్ట్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. కిరానా హిల్స్‌లోని పాకిస్థాన్ అణు కేంద్రంపై భారత్ దాడి చేసిందా? అని అడిగారు. ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ కేకే భారతి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘కిరానా హిల్స్‌లో అణు కేంద్రం ఉన్నదని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. అక్కడ ఏమి ఉన్నప్పటికీ కిరానా హిల్స్‌పై మేం దాడి చేయలేదు’ అని అన్నారు.
#OperationSindoor | Delhi: When asked if India hit Kirana Hills, Air Marshal AK Bharti says, “Thank you for telling us that Kirana Hills houses some nuclear installation, we did not know about it. We have not hit Kirana Hills, whatever is there.” pic.twitter.com/wcBBVIhif1
— ANI (@ANI) May 12, 2025