Character of Terrorists | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించి ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల స్వభావం (Character of Terrorists changed) మారిపోయిందని ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (Lieutenant General Rajiv Ghai) అన్నారు. ‘గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం తీరులో మార్పు వచ్చింది. ఉగ్రవాదులు తమ స్వభావాన్ని మార్చుకున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పర్యాటకులు, భక్తులు, యాత్రికులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు’ అని రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు.
ఆ సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ ఓ క్రికెట్ స్టోరీ చెప్పారు. మన ఎయిర్ ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమన్నారు. ఆ అంశాన్ని ఆయన వివరిస్తూ ఓ క్రికెట్ సంఘటన గుర్తు చేశారు. అయితే ఇవాళ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారని, అతను తనకు ఫెవరేట్ క్రికెటర్ అని తెలిపారు.
ఇక 1970 దశకంలో యాషెస్ సిరీస్ ఒకటి జరిగిందని, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ముచ్చమటలు పట్టించారన్నారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీలు కూల్చేశారన్నారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఓ నానుడి వచ్చిందని, యాషెస్ టు యాసెస్, డస్ట్ టు డస్ట్, ఇఫ్ థామో డోంట్ గెట్ యా, లిల్లీ మస్ట్ అన్న ప్రావర్బ్ పుట్టిందన్నారు.
అంటే ఒకవేళ జెఫ్ థాంప్సన్‌ను తప్పించుకున్నా.. డెన్నిస్ లిల్లీకి బ్యాటర్ చిక్కాల్సిందే అన్న రీతిలో ఆ స్టేట్మెంట్ ఉంది. ఈ అంశాన్ని పరిశీలిస్తే, నేను చెప్పేది మీకు అర్థం అవుతుందని, ఒకవేళ అన్ని పొరలు దాటినా.. ఈ వ్యవస్థలోని ఏదో ఒక దగ్గర గట్టి ప్రతిఘటన తప్పదని పాకిస్థాన్‌కు తనదైన స్టయిల్లో ఘాయ్ హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఇవాళ త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. మూడు దళాలకు చెందిన డీజీఎంవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫైట్ చేసినట్లు తెలిపారు. ఉగ్రవాదులను టార్గెట్ చేసిన సమయంలో పాకిస్థాన్ మిలిటరీ జోక్యం చేసుకున్నదని, ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యతిరేకించిందని, అందుకే తాము రెస్పాండ్ అయినట్లు వారు వివరించారు.
Also Read..
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్.. పాక్ మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇండియన్ ఆర్మీ.. VIDEO