PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ఇప్పటికే వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి.. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేయబోతున్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు (Independence Day) దేశం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా 11వ సారి (11th straight time) మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. తద్వారా పండిట్ జవహర్లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు.
మరోవైపు ఈ వేడుకలకు 18 వేల మందికిపైగా హాజరవుతారని అంచనా. పేదలు, మహిళలు, యువత, రైతులను ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ఆహ్వానితుల లిస్ట్‌ను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కూడా ఈ వేడుకలకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నారు.
Also Read..
Noida | నోయిడా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువకుడు.. ఎలా బయటకు తీసుకొచ్చారా చూడండి.. VIDEO
Kangana Ranaut | రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరం.. జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే : కంగన రనౌత్