Tom Cruise | ఫ్యాషన్ నగరి పారిస్ (Paris)లో మూడు వారాలుగా క్రీడా లోకాన్ని అలరించిన విశ్వక్రీడా పండుగకు తెరపడింది. ఒలింపిక్స్ చరిత్రలో (Paris Olympics) మునుపెన్నడూ లేనివిధంగా స్టేడియం లోపల కాకుండా ప్రఖ్యాత సీన్ నదిలో ఆరంభ వేడుకలతో మొదలైన ఈ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఎన్నో సంచలనాలు, మరెన్నో అబ్బురపరిచే ప్రదర్శనలు, కొత్తగా నమోదైన రికార్డులు, త్రుటిలో చేజారిన పతకాలు, క్రీడాకారుల నాలుగేండ్ల కఠోర శ్రమకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన పారిస్.. ఆటలకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇక ఈ విశ్వ క్రీడల ముగింపు వేడుకల్లో(Closing Ceremony) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ హాలీవుడ్ ప్రముఖ నటుడికి విచిత్ర అనుభవం ఎదురైంది. నటుడితో ఫొటో దిగేక్రమంలో అతడికి ఓ మహిళ బలవంతంగా ముద్దుపెట్టింది (Woman Kissed).
ముంగిపు వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise) ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన విషయం తలిసిందే. ప్రదర్శన అనంతరం వేదిక నుంచి బయటకు వస్తుండగా.. నటుడిని అభిమానులు చుట్టుముట్టారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలో ఓ మహిళ ఫొటో తీసుకుంటూ హఠాత్తుగా టామ్ క్రూజ్‌ను బలవంతంగా లాక్కొని అతడి చెంపపై ముద్దు పెట్టింది. ఈ పరిణామంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో నవ్వుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
How’d that lady almost make out with Tom Cruise on international TV 😂#ClosingCeremony pic.twitter.com/IxtmIUPdcA
— Georgia Rose 🇿🇦 🍉 (@Rasheeda_S) August 11, 2024
Also Read..
Kangana Ranaut | రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరం.. జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే : కంగన రనౌత్