Love couple suicide : నిన్న ప్రియురాలు, నేడు ప్రియుడు బలవంతంగా తనువు చాలించిన ప్రేమజంట
వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు.
యాచారం, జనవరి7 : యాచారం : వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు. ఉరేసుకొని నిన్న ప్రియురాలు, పెట్రోల్ పోసుకొని నేడు ప్రియుడు ఇద్దరు బలవన్మరణానికి(Love couple suicide) పాల్పడ్డారు. క్షణికావేశంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. దీనికి సంబంధించి సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కలువకుండా చేయడం వల్లే..
రంగారెడ్డ జిల్లా యాచారం(Yacharam) మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో పోతురాజు అలివేలు కూతురు పోతురాజు పూజ (16)అనే విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. పూజా తండ్రి పదహారేళ్ల క్రితం మృతి చెందడంతో అప్పటినుంచి తన తల్లి అలివేలు కుమారుడు కుమార్తె ఇరువురిని పెంచి పోషించింది. అదే గ్రామానికి చెందిన సిద్ధగోని యాదయ్య కుమారుడు సిద్ధగోని మహేష్ (20) గత నాలుగు ఐదు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలవడంతో వీరిని గత కొన్ని రోజులుగా కలుసుకోకుండా చేశారు.
దీంతో ఇటీవలే మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కొన్ని రోజులు దవాఖానాలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. మహేష్ పురుగుల మందు తాగిన విషయాన్ని తెలుసుకున్న పూజ సైతం మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ఆమె సైతం ప్రాణాలతో బయటపడింది. ఇదిలా ఉంటే గత సోమవారం మహేష్ మళ్లీ పూజ తాత నారయ్య ఫోన్ కు ఫోన్ చేసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పడంతో ఈ విషయాన్ని పూజ తన తల్లి అలివేలుతో చెప్పింది.
ప్రియురాలు మృతి తట్టుకోలేక..
మహేష్ ఫోన్ చేసినప్పటి నుంచి పూజ మానసిక ఒత్తిడికి గురైంది. తన ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడేమోనని దిగులుతో తానే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం ఎనిమిది గంటలకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూజ మృతి చెందడంతో గ్రామంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. పోలీసుల రంగప్రవేశంతో పూజ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురూకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం మృతదేహాన్ని తీసుకొచ్చి పూడ్చిపెట్టారు.
పూజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న అన్న విషయాన్ని తెలుసుకున్న మహేష్ బుధవారం హయత్ నగర్ పరిధిలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అటు పూజ ఇటు మహేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో మేడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇరు కుటుంబాలలో రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

