Noida | గ్రేటర్ నోయిడా (Greater Noida) దాని పరిసర ప్రాంతాల్లో లిఫ్ట్ (Lift) సంబంధించిన సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలివేటర్ల నిర్వహణ కోసం ఎన్ని కొత్త చట్టాలు అమలు చేసినప్పటికీ.. ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. నోయిడా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక సొసైటీలో ఇదే సమస్య పునరావృతమవుతోంది. తాజాగా గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఓ యువకుడు ఇరుక్కుపోయాడు.
ఆదివారం రాత్రి గ్రీన్ ఆర్చ్ సొసైటీ (Greenarch Society) లిఫ్ట్‌లో ఓ యువకుడు ఇరుక్కుపోయాడు. సాంకేతిక సమస్య కారణంగా ఎలివేటర్ తలుపులు తెరుచుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది యువకుడిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించింది. రాడ్ల (Iron Rod)ను ఉపయోగించి ఎలివేటర్ తలుపులను తెరిచి.. యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
A boy was trapped for over an hour in a malfunctioning lift at Saviour GreenArch society, Greater Noida West, late Sunday. He was rescued after technicians from the maintenance department arrived.#NoidaLift #BoytrappedinNoidalift #Greenarchsocietylift #GreaterNoidalift pic.twitter.com/Im5rl1fLmw
— Republic (@republic) August 12, 2024
Also Read..
Kangana Ranaut | రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరం.. జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే : కంగన రనౌత్
Ravi Shankar Prasad: ఆర్థిక అస్థిరతను కాంగ్రెస్ సృష్టిస్తోంది: రవిశంకర్ ప్రసాద్