PM Modi | న్యూఢిల్లీ : దాయాది దేశం పాకిస్తాన్‌తో చర్చలు పాక్ ఆక్రమిత కశ్మీర్, ఉగ్రవాదంపైనే అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలి. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవు. ఉగ్రవాదం, వాణిజ్యం రెండూ ఏకకాలంలో ఉండవు. ఉగ్రవాదం, నీటి పంపిణీ రెండూ ఏకకాలంలో ఉండవు. పాకిస్తాన్‌తో చర్చలు అంటే ఉగ్రవాదంపైనే. పాకిస్తాన్‌తో చర్చలు అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ తప్ప ఏ అంశంపైనా చర్చలు ఉండవు అని మోదీ తేల్చిచెప్పారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. భారత్ తుదముట్టించి తీరుతుంది. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏమిటన్నది ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ చవిచూసింది. ఉగ్రవాదానికి అన్నపానీయాలు అందించే ఎవర్నీ భారత్ ఉపేక్షించదు. భారత్ రక్షణ దళాల సామర్థ్యం ఏంటో ఆపరేషన్ సిందూర్ పాక్‌కు రుచిచూపించింది. సాంకేతిక యుద్ధంలో భారత్ పరిణితి, ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో, ఎంత శక్తివంతమైనవో భారత్ ప్రదర్శించింది. ఈ యుగం యుద్ధాలది కాదు.. ఉగ్రవాదానిది అంతకంటే కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు, దాడులకు భారత్ వెనుకాడదు అని మోదీ స్పష్టం చేశారు.
#WATCH | During his address to the nation, Prime Minister Narendra Modi says, “…If there will be talks between India and Pakistan, it will only be on terrorism and Pakistan Occupied Kashmir (PoK)…India’s stand has been clear, terror, trade and talks cannot be done together.” pic.twitter.com/Bh7JzpyJtV
— ANI (@ANI) May 12, 2025