PM Modi | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఘాటుగా స్పందించారు. 2014 వరకూ కాంగ్రెస్ హయాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నిరుపయోగంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే ఈడీ సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న చట్టాలు, సంస్థలు కాంగ్రెస్ హయాంలోనూ ఉన్నాయని మోదీ గుర్తు చేశారు.
అదే సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కూడా ప్రధాని స్పందించారు. ఆ సొమ్మును పేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ‘అవినీతి కేసుల్లో (corruption cases) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు తిరిగి పంచే అవకాశాలను కేంద్రం అన్వేషిస్తోంది’ అని మోదీ వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు.
ఆ డబ్బంతా తిరిగి వారికే చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం లీగల్ టీమ్ సహాయాన్ని తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేయాలో సలహా ఇవ్వాలని న్యాయవ్యవస్థను కోరినట్లు ప్రధాని వివరించారు. ఇందుకోసం చట్టపరమైన మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2,200 కోట్లను జప్తు చేసినట్లు ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.
Also Read..
Everest | ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై బ్యాన్ విధించిన నేపాల్
Swati Maliwal | దాడి ఘటనలో స్వాతి మలివాల్ ముఖంపై అంతర్గత గాయాలు.. వైద్య పరీక్షల్లో వెల్లడి
PM Modi: హ్యాట్రిక్ కొడుతున్నాం: ప్రధాని మోదీ