బారాబంకి: యూపీలోని బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడారు. కేంద్రంలో తమ సర్కారు హ్యాట్రిక్ కొట్టనున్నట్లు ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సరళి ముగుస్తున్నా కొద్దీ.. ఇండియా కూటమి పేకమేడలా కూలుతోందని విమర్శించారు. తాము ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంలో పేద, యువత, మహిళలు, రైతుల కోసం పెద్ద నిర్ణయాలను తీసుకోనున్నట్లు చెప్పారు. బీజేపీ-ఎన్డీఏ కూటమి జాతీయ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉందని, ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిరత సృష్టిస్తోందని ప్రధాని తెలిపారు.
ఒకవేళ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తే, అప్పుడు రామ్‌లల్లా మళ్లీ టెంట్‌లోకి వెళ్తారని ప్రధాని మోదీ అన్నారు. రామాలయంపై వాళ్లు బుల్డోజర్ తోలిస్తారని విమర్శించారు. యోగీజీ నుంచి వాళ్లు ట్యూషన్ తీసుకోవాలని, ఎక్కడ బుల్డోజర్ నడపాలి, ఎక్కడ తీయవద్దు అన్న విషయాన్ని విపక్షాలు తెలుసుకోవాలని మోదీ అన్నారు.