PM Modi | ఉపాధికి ఊతమిచ్చే బడ్జెట్ : మధ్యంతర బడ్జెట్‌ను స్వాగతించిన ప్రధాని మోదీ
PM Modi : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 ఆశాజనకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు.
PM Modi : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 ఆశాజనకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. కేంద్ర బడ్జెట్ మెరుగ్గా ఉందని స్వాగతిస్తూ ఎన్నో ఉపాధి అవకాశాలకు ఇది ఊతమిస్తుందని స్వాగతించారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. పేద, అణగారిన వర్గాలు, గ్రామీణ, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ అద్దం పడుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో రైతుల మేలు కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇన్‌కం ట్యాక్స్ రెమిషన్ స్కీమ్‌తో మధ్యతరగతికి చెందిన కోటి మందికి భారీ ఊరట లభిస్తుందని అన్నారు.
ఇక భారత్‌ను 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ సర్కార్ చిట్ట చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నారు. గడిచిన పదేళ్లలో మహిళల సాధికారత పెరిగిందన్నారు. ట్రిపుల్ తలాక్‌ను చట్టరీత్యా నేరం చేశామన్నారు. ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లు చెప్పారు.
అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని రికార్డు సమయంలో క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. భారత అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం మహిళల సంఖ్య పెరిగిందన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ఆమె వెల్లడించారు.
Read More :
Budget 2024 | మధ్య తరగతి ప్రజలకు కొత్తగా గృహనిర్మాణ విధానం : నిర్మలా సీతారామన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

