Budget 2024 | మధ్య తరగతి ప్రజలకు కొత్తగా గృహనిర్మాణ విధానం : నిర్మలా సీతారామన్
Budget 2024 | మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రకటించారు.
Budget 2024 | మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. మధ్య తరగతి కోసం కోసం కొత్తగా గృహనిర్మాణం విధానం తీసుకురాబోతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇండ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చామన్నారు. కొవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అమలు కొనసాగించామన్నారు.
3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం వినిపిస్తూ.. జీడీపీకి ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందన్న ఆర్థిక మంత్రి.. జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చామన్నారు. పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామన్నారు. పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50శాతానికిపైగా పెరిగిందన్నారు. వాసవ్త ఆదాయ పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాలు పెంచిందన్నారు. ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

