PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రెండు రోజుల పాటూ బ్రిటన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశంతో కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3తో భేటీ అయ్యారు. నార్ఫోక్లోని సాండ్రింగ్హామ్ ఎస్టేట్ (Royal Estate)లో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజుకు ఓ మొక్కను ప్రధాని బహుమతిగా ఇచ్చారు.
ప్రధాని మోదీ భారత్లో అమ్మ పేరుతో ఓ మొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్ఫూర్తితో బ్రిటన్ రాజుకు సొనోమా డోవ్ అనే మొక్కను బహూకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ది రాయల్ ఫ్యామిలీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. దాన్ని శరదృతువు వచ్చాక ఎస్టేట్లో నాటనున్నట్లు పేర్కొంది.
His Majesty King Charles III is very passionate about nature, environment and sustainable living. Thus, his joining the ‘Ek Ped Maa Ke Naam’ (a tree for Mother) movement is very noteworthy and will inspire people around the world. https://t.co/oHa0rlyZmn
— Narendra Modi (@narendramodi) July 24, 2025
Also Read..
ఇక స్వేచ్ఛగా వాణిజ్యం.. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
Mid-air Miracle | విమానం 35 వేల అడుగుల ఎత్తులో వెళ్తుండగా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Lok Sabha | పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న ఓటరు జాబితా సవరణ.. లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా