PM Modi | జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో ఉగ్రదాడి ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రంగా ఖండించారు. పెహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి.. అమాయకుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఉగ్రదాడిని భారత్ ఎన్నటికీ క్షమించదన్నారు. బీహార్లోని మధుబనిలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘పెహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు. దేశంపై జరిగిన దాడి. ఈ దాడిని భారత్ ఎన్నటికీ క్షమించదు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు. కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తాం. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ వేటాడి శిక్షిస్తాం. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజలకు మాటిస్తున్నా.. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రనేతలను కూడా విడిచిపెట్టం. ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతోంది’ అంటూ ఉగ్రవాదులకు ప్రధాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read..
Pahalgam Attack | ఉగ్రదాడి కారణంగా పాక్తో సింధు జలాల ఒప్పందం రద్దు.. ఇంతకీ ఏంటా ఒప్పందం..?
Pahalgam Attack | ఉగ్రదాడి.. భారత్లో పాకిస్థాన్ ఎక్స్ అకౌంట్ నిలిపివేత