Pahalgam Attack | మంగళవారం మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్‌లో ప్రవేశంపై నిషేధం విధించడం వంటి ఐదు అంశాలతో కూడిన చర్యలను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను (Pakistan Governments X Account) నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది.
పాకిస్థాన్‌పై భారత్ చర్యలు..
Also Read..
Pahalgam Terror Attack | పాకిస్థానీయులకు దేశంలోకి ప్రవేశం నిషేధం.. భారత్ కీలక నిర్ణయాలు
Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు – భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి.. పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు