హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ( Six guarantees ) చట్ట బద్దత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ( MLA Sanjay ) డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసేంత వరకు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపామని వెల్లడించారు.
అసెంబ్లీ సాక్షిగా ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అసెంబ్లీ దేవాలయం లాంటిది, దేవాలయం లాంటి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. కొత్తగా వచ్చిన గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని, అబద్ధాలు చెప్పినందుకు గవర్నర్ దేవాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.