US Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నిర్మల్ యువకుడు మృతి
US Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు నిత్యానంద రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
US Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు నిత్యానంద రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (26) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో నివాసం ఉంటూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం బైక్‌పై బయటకు వెళ్లిన నిత్యానంద రెడ్డిని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిత్యాందను అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిత్యానంద.. బ్రెయిన్ డెడ్ కారణంగా గురువారం మరణించాడు. దీనిపై ఇండియాలోని కుటుంబానికి సమాచారం అందించారు. కాగా, నిత్యానంద రెడ్డి మరణవార్తతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

