Vijay | సీఎం విజయ్ చివరి సినిమాకి షాక్.. బాక్సాఫీస్ వద్ద కనిపించని జోష్
Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 23న గ్రాండ్‌గా విడుదలైంది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 23న గ్రాండ్‌గా విడుదలైంది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వసూళ్లు నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.సెన్సార్ జాప్యం కారణంగా దాదాపు ఏడు నెలలు వాయిదా పడిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. తమిళనాడులో చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం అదే స్థాయి స్పందన కనిపించలేదు.
భారత్‌లో తొలి రోజు ఈ చిత్రం సుమారు రూ.41 కోట్ల నెట్, దాదాపు రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ రెండు భాషల్లో కలిపి కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే నమోదైనట్లు సమాచారం. విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల లోపం ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ‘జన నాయగన్’ పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్లతో కలిపి తొలి రోజే 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయగా, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మరో 1 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. మొత్తంగా విదేశాల్లో 3.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్ల గ్రాస్) రాబట్టిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు దాదాపు రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
విజయ్ చివరి సినిమా కావడంతో తొలి రోజే రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ మార్కును అందుకోవడంలో సినిమా విఫలమైంది. అంతేకాదు, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన టాప్-25 చిత్రాల జాబితాలో కూడా చోటు సంపాదించలేకపోయింది. విజయ్ గత చిత్రాలతో పోల్చితే కూడా ‘జన నాయగన్’ వెనుకబడింది. ‘లియో’ తొలి రోజు రూ.150 కోట్లకు పైగా, ‘గోట్’ రూ.99 కోట్లు, ‘బీస్ట్’ రూ.83 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ‘జన నాయగన్’ వాటి కంటే తక్కువ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన రజనీకాంత్ ‘కూలీ’ సాధించిన రూ.152 కోట్ల ఓపెనింగ్‌తో పోలిస్తే కూడా ఈ సినిమా చాలా వెనుకబడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

