ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని నామవరం గ్రామానికి చెందిన గోపీగా గుర్తించారు. అతను స్థానికంగా ఓ షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తు్న్నట్లు తెలుస్తోంది. కాగా, బైక్‌పై యూటర్నింగ్ దాటుతున్న సమయంలో నాయుడుపేట వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ గోపీని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షలుత తెలిపారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.